మళ్లీ బీజేపీదే అధికారం- అమిత్ షా

|

Apr 05, 2019 | 6:41 PM

 అరుణాచల్ ప్రదేశ్: ప్రధాని నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టిపెట్టారని స్పష్టం చేశారు. అరుణాచల్‌లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో మోడీ హయాంలోనే తొలి వైద్య కళాశాల ఏర్పాటైందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఈశాన్య […]

మళ్లీ బీజేపీదే అధికారం- అమిత్ షా
Follow us on

 అరుణాచల్ ప్రదేశ్: ప్రధాని నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టిపెట్టారని స్పష్టం చేశారు. అరుణాచల్‌లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో మోడీ హయాంలోనే తొలి వైద్య కళాశాల ఏర్పాటైందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు గందరగోళంగా ఉండేవని.. అభివృద్ధి  ఆనవాళ్లే కానరాలేదన్నారు. కానీ బీజేపీ అధికారం లోకి వచ్చాక..  ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తోందని వివరించారు. దాదాపు 40 సంవత్సరాల తరవాత దేశ ప్రధాని షిల్లాంగ్‌లో అడుగుపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రులను ఇక్కడ తరచూ పర్యటించాలని మోడీ ఆదేశించారని అమిత్ షా తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధి కోసం రూ.50వేల కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందన్నారు.