బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖకు రూ.29, 271 కోట్ల కేటాయింపులు.. మరింత ముమ్మరంగా గ్రామీణాభివృద్ధి-పల్లె ప్రగతి

|

Mar 18, 2021 | 12:36 PM

అసెంబ్లీలో తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు అధిక నిధులు..

బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖకు రూ.29, 271 కోట్ల కేటాయింపులు.. మరింత ముమ్మరంగా గ్రామీణాభివృద్ధి-పల్లె ప్రగతి
Ts Panchayath Budget
Follow us on

అసెంబ్లీలో తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు అధిక నిధులు కేటాయించారు. రూ.29,271 కోట్లను ప్రతిపాదించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయని చెప్పారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు దారిపొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది.ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ,పచ్చదనాన్ని పెంచాలని గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణ ప్రకటించారు.

ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని సుందరంగా మార్చేసింది చెత్త సేకరణ మీద అ ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమం నిర్వహించింది ప్రతి గ్రామానికి తరలింపునకు ఒక ట్రాక్టర్ ను డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లె పరిశుభ్రంగా మారిపోయాయి పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టం లో గ్రామ సర్పంచు లకు ప్రత్యేక విధులను బాధ్యతను పేర్కొంది ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్ సమకూర్చింది

స్థానిక సంస్థల బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది దీనికి సంబంధించి అధికార వికేంద్రీకరణ చేస్తూ కలెక్టర్ లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్రం స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామపంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి ఈ సంవత్సరం రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ట్రాక్టర్లను అందించాం దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలాలు లేదు ఇవ్వాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల టెన్షన్ గా నిధులను విడుదల చేస్తున్నది పల్లె ప్రగతి కింద ఇప్పటివరకు 5761 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు విడుదల చేశామని చెప్పారు.

తెలంగాణ తరహాలో వేరే రాష్ట్రం గ్రామాలకు ఈ విధంగా నిధులను విడుదల చేయడం లేదు ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ నర్సరీ పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం వంటి మౌలిక సౌకర్యాలు తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటా పథంగా చెప్పగలనని హరీశ్‌రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులు రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా సమానమైన డబ్బులను కలిపి గ్రామాలకు అందించాలని నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి ఆగిపోవద్దని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి మండల పరిషత్తు లకు జిల్లా పరిషత్ లకు 500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో జిల్లా పరిషత్తు లకు రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలను మండల పరిస్థితులకు రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేస్తుందని మంత్రి వివరించారు.

Read More:

తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ రూ.2,30,825 కోట్లు.. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ -హరీశ్‌రావు