Dasoju Sravan Kumar : సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటలకే తెలంగాణలో ఎంతో మంది చనిపోయారు : దాసోజు శ్రవణ్

|

Jun 23, 2021 | 5:30 PM

కరోనా పట్ల అప్రమత్తతను, జాగ్రత్తలను సూచించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ కరోనా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించేలా మాట్లాడారని ఏఐసీసీ..

Dasoju Sravan Kumar : సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటలకే తెలంగాణలో ఎంతో మంది  చనిపోయారు : దాసోజు శ్రవణ్
Dasoju Sravan On Kcr
Follow us on

AICC spokes person Dasoju Sravan : కరోనా పట్ల అప్రమత్తతను, జాగ్రత్తలను సూచించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ కరోనా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించేలా మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. గతంలోనూ ఒకసారి ఇలాగే మాస్క్ ల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారని దాసోజు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శ్రవణ్..

“సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణలో కొన్ని లక్షల మంది చనిపోయారు. కేవలం గ్రేటర్ హైదరాబాదు లోనే లక్ష మంది చనిపోయి ఉంటారు. కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆక్సిజన్ లభించక, ఔషధాల కొరత కారణంగా ఎంతో మంది చనిపోతే, ప్రజల్ని చైతన్య పరచాల్సిన సీఎం కరోనా లేదు, బ్లాక్ ఫంగస్ లేదు అంటున్నారు.” అని శ్రావణ్ అన్నారు.

“పారాసెటమాల్, డోలో చాలు అంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి గారు మీరేమైనా డాక్టరా?” అని దాశోజు ప్రశ్నించారు. ప్రజలకు భయం పోవడం వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందని శ్రవణ్ అన్నారు. మరణాల సంఖ్య వాస్తవ గణాంకాలు బయటపెడితే ప్రజల్లో భయం ఉండేది.. తద్వారా కొవిడ్-19 జాగ్రత్తలు పాటించి తమ ప్రాణాలు కాపాడుకునే వారు. కాని అలా జరగలేదని శ్రవణ్ అన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అడ్డుకునే జీవో తెచ్చామని చెబుతున్నారు, కానీ దానితో ఉపయోగం లేదని శ్రవణ్ అన్నారు. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతుంటే, థర్డ్ వేవ్ లేదు అని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అని ఆయన సీఎం ను ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని కొనసాగించడం కోసమే, సీఎం ఇలా మాట్లాడుతున్నారని దాసోజు ఆరోపించారు.

“ఢిల్లీకి వ్యక్తిగతమైన పని మీద వచ్చా.. ఎలాగూ వచ్చాను కాబట్టి ఏఐసీసీలో కొందరిని కలిసా.. త్వరలో టీపీసీసీ కొత్త నాయకత్వంపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నా” అని శ్రవణ్ అన్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ తో భేటీతోపాటు, మరికొందరు ఏఐసీసీ పెద్దలను శ్రవణ్ కలిసినట్టు సమాచారం.

Read also : CM Jagan reply to Chiru : చిరంజీవి సందేశానికి రిప్లై ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి