
బాలీవుడ్ నటి, నార్త్ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అనుచరులతో కలిసి ఆమె వీధి వీధి తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓ హోటల్‌లో పావ్‌బాజీ తింటూ సందడి చేశారు. ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని.. తప్పకుండా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఊర్మిళ. బీజేపీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. మోడీ పాలనతో అందరూ విసుగుచెందారని ఆమె అన్నారు.