Yoga Benefits: జుట్టు రాలిపోతుందా.. రోజూ ఈ యోగాసనాలు ట్రై చేయండి.. నెలలోనే ఫలితం కనిపించడం ఖాయం

|

Sep 24, 2024 | 4:06 PM

నేటి కాలంలో మనవ జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాల వలన జుట్టు రాలడం అనే సమస్యను స్త్రీలు, పురుషులు ఇరువురు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీంతో జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం కోసం అనేక నివారణ చర్యలు, ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. వీటితో పాటు జుట్టు రాలడం తగ్గడానికి మీ దిన చర్యలో కొన్ని యోగా ఆసనాలను చేర్చుకోవడం వలన జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ యోగాసనాలను ఒక నెలరోజులు ఏకదాటిగా చేయడం వలన అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.

1 / 6
జుట్టు రాలడం నుంచి విముక్తి పొందడానికి మీ దినచర్యలో కుందేలు భంగిమలో శశాంకసన చేర్చుకోండి. ఈ యోగాసనం చేయడానికి శరీరాన్ని మోకాళ్లపై పట్టుకుని తలను ముందుకు వంచి నేలపై ఉంచాలి. ఈ యోగా ఆసనం చేయడం వల్ల తల వైపు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం చేయడం ద్వారా మెడ, భుజాలు, వెనుక కండరాలు నొప్పి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. (AzmanL/E+/Getty Images)

2 / 6
యోగా ఆసనాల్లో ఒకటి శీర్షాసనం. అయితే దీనిని మీరు నేర్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ శీర్షాసనం జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.    చర్మానికి కూడా మేలు చేస్తుంది. శీర్షాసనం వేయడం వలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. భుజ బలం పెరుగుతుంది. ఈ ఆసనం ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. (Jose Martinez/Getty Images)

3 / 6
మత్స్యాసనం కూడా హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడే ఆసనం. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఈ యోగా ఆసనం చేయడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ యోగాసనం ఒత్తిడి నుంచి ఉపశమనం అందిస్తుంది. తల వైపు మంచి రక్త ప్రసరణ కారణంగా జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆసనం పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యల నివారణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం శరీరం మంచి ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది. AzmanL//E+/Getty Images

4 / 6
జుట్టు రాలడాన్ని నివారించడానికి అధో ముఖ స్వనాసనాన్ని ప్రతిరోజూ చేయవచ్చు. ఈ ఆసనం చేయడం వలన తల వైపు మాత్రమే కాదు మొత్తం శరీరం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ యోగాసనం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆసనం చేయడం వలన స్కిన్ కి సహజమైన గ్లో పెరుగుతుంది. ఈ ఆసనం బొడ్డు దగ్గర ఉన్న కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కాళ్లు, చీలమండలు మొదలైన వాటి కండరాలను అనువైనదిగా చేస్తుంది. ఇది దృఢత్వం,యు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  (Portra/Getty Images)

5 / 6

జుట్టు రాలడం సమస్యను తగ్గించడానికి, ప్రతిరోజూ ఉత్తానాసనం సాధన చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడంతోపాటు తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ యోగాసనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వలన వెన్ను, నడుము కండరాలు కూడా ఫ్లెక్సిబుల్ గా మారతాయి. (AzmanJaka/Getty Images)

6 / 6
యోగాతో పాటు జుట్టు రాలడాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొంత సమయం పాటు నాడి శోధన ప్రాణాయామం చేయాలి. వాస్తవానికి ఈ ప్రాణాయామం హార్మోన్ల అసమతుల్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టు రాలడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణం. అంతేకాదు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడం, రక్తాన్ని శుద్ధి చేయడం, ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రతను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం మొదలైన వాటిలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది.  Deepak Sethi/E+/Getty Images)