బద్ధకోనాసనం చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ యోగాసనం చేయడం వల్ల పెల్విక్ ప్రాంతం దృఢంగా మారుతుంది. పునరుత్పత్తి అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఈ యోగా ఆసనం చేయాలి. ఎందుకంటే దీని అభ్యాసం ప్రసవం సులభతరం చేస్తుంది.

గర్భధారణ సమయంలో వీరభద్రాసనం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాళ్ళు, వెన్నెముక, నడుము కండరాలను బలపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ యోగాసనం చేయడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే అలసట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాదు ఈ యోగా ఆసనం చేయడం వల్ల హామ్ స్ట్రింగ్స్, దూడ కండరాల వెనుక భాగం సాగుతుంది. అదే సమయంలో ఈ యోగా ఆసనం మనస్సును బలపరుస్తుంది. ఇది డెలివరీకి మానసికంగా సిద్ధం కావడానికి కూడా సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో స్త్రీలు అనులోమ్-విలోమ్, భ్రమరి, నాడిశోధన వంటి ప్రాణాయామం చేయాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంది. అయితే సరైన పద్ధతి తెలిసినప్పుడే ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రాణాయామాలు శ్వాస లయకు సంబంధించినవి. కనుక ప్రాణాయామం సరైన పద్దతిలో చేయకపోతే అది హానిని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో కపాలభాతి ప్రాణాయామం పొరపాటున కూడా చేయవద్దు.

గర్భధారణ సమయంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక గర్భిణీ స్త్రీలు యోగా చేస్తున్నప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పు సమయంలో ఎవరైనా మీ దగ్గర ఉంచుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా వంచడానికి లేదా ఒత్తిడికి గురి అయ్యేలా ప్రయత్నించవద్దు. గర్భిణీ స్త్రీలు ఉండే వాతావరణం పరిసరాలు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంతే కాదు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. నిపుణుల సలహాతో మాత్రమే యోగా చేయాల్సి ఉంది.