
నాన్‌వెజ్ అంటే ఇష్టపడిని వారు ఎవరు ఉంటారు. ప్రతి ఒక్కరికి మాంసం అంటే ప్రేమే.. అయితే మానవులు తినే కొన్ని రకాల మాంసా ఆహారాలు లగ్జరీ కారు, బంగారు ఆభరణాల కంటే ఎక్కువ ధరలను కలిగి ఉంటాయట. వాటి ప్రత్యేక రుచి కారణంగానే ఆ ఆహార పదార్థాలకు అంత ధర ఉంటుందట. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాంసాహారాల ఏవో చూద్దాం.

అల్మాస్ కేవియర్: అల్మాస్ కేవియర్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాంసంగా పేర్కొనబడుతుంది. ఇది ప్రపంచంలోనే అరుదైన ఆహార పదార్థాలలో ఒకటి. ఇది కాస్పియన్ సముద్రంలోని అరుదైన అల్బినో బెలుగా స్టర్జన్ చేపల గుడ్ల నుండి లభిస్తుంది. ఈ గుడ్లు చూడ్డానికి బంగారం-పసుపు రంగులో ఉంటాయి. వీటి రుచికూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ధర దాదాపు $43,500, అంటే కిలోకు దాదాపు 28 నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్రస్తుతం బంగారం రేటు కన్నా చాలా రెట్లు ఎక్కువ

బ్లూఫిన్ ట్యూనా: ఇది కూడా ఒక సీ ఫుడ్..బ్లూఫిన్ ట్యూనా అనేది ఒక చేప.. ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన చేపలలో ఒకటి. ఈ చేప దాని అధిక కొవ్వు, రుచి కారణంగా జపాన్ సుషీ సంస్కృతిలో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చేప బొడ్డు భాగాన్ని 'ఒటోరో' అని పిలుస్తారు, ఇది వెన్నలాంటి మృదువైన ఆకృతికి ప్రసిద్ధి చెందింది. జపాన్ చేపల మార్కెట్లో, ఈ చేప కోట్లలో వేలం వేయబడుతుంది. ఈ చేప మాంసం కేజీ ధర రూ.4-5లక్షలు ఉంటుంది.

అయామ్ సెమానీ: ఇదొక కోడి మాంసం. కోడి మాంసంకు ఇంత ధర ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది మన దగ్గర దొరికే నార్మల్ కోడి కాదు.. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో లభించే నల్లటి కోడి. దీని నలుపుకోడి అని పిలుస్తారు, దీని ఈకలు, చర్మం, ముక్కు, ఎముకలు, మాంసం, శరీర భాగాలు అన్ని నల్లగానే ఉంటాయి. ఈ కోడి ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అందుకే ఈ కోడిని 'కోళ్ల లంబోర్ఘిని' అని పిలుస్తారు.

వాగ్యు బీఫ్: ఇది జపాన్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన పశువు జాతి మాంసం. ఇది దాని మృదువైన, అద్భుతమైన రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పశువులను చాలా కఠినమైన నియమాల ప్రకారం, ప్రత్యేక వాతావరణంలో పెంచుతారు. అందుకే వీటి మాంసానికి అంత డిమాండ్ ఉంటుంది. నిజమైన జపనీస్ వాగ్యు బీఫ్ ధర కిలోకు 40 నుండి 50 వేల రూపాయల వరకు ఉంటుంది.