భారతదేశంతో సహా అనేక దేశాల్లో జూదం నిషేధించబడింది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా ఆడుతూ పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే.. జూదాన్ని చట్టబద్ధం చేసిన దేశాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ దేశాల్లో కాసినోకు వెళ్లి జూదం ఆడతారు. గెలుస్తారు, ఓడిపోతారు.. కానీ ఈ రోజు మనం జూదంలో బిలియనీర్‌గా మారిన వ్యక్తి గురించి తెల్సుకుందాం.. అవును ఇతడిని ప్రపంచంలోనే అత్యంత ధనిక జూదగాడు అంటారు. (ఫోటో: Instagram/danbilzerian)
ఈ వ్యక్తి పేరు డాన్ బిల్జేరియన్. పేకాట ఆడి కోట్లు సంపాదిస్తున్నాడు. అందుకే అతడిని 'పేకాట రాజు' అని కూడా అంటారు. అతను చాలా హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశాడు. ఈ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. (ఫోటో: Instagram/danbilzerian)
డాన్‌కు దాదాపు $150 మిలియన్ల ఆస్తులు అంటే మన దేశ కరెన్సీలో 10 వేలకోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అతను పేకాట ఆడటం ద్వారా ఈ డబ్బును సంపాదించాడని నమ్ముతారు. పేకాట ఆడి ఒక్క రాత్రిలోనే 11 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.83 కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. (ఫోటో: Instagram/danbilzerian)
డాన్‌కు తుపాకులు, లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. అతను ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన వాహనాలను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు తుపాకుల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. అతని వద్ద అత్యంత ఖరీదైన, విలాసవంతమైన తుపాకులు ఉన్నాయి. అతని ఖరీదైన లైఫ్ స్టైల్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. (ఫోటో: Instagram/danbilzerian)
డాన్‌ను ప్రజలు 'ప్లేబాయ్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అతను ధనవంతుడు.. కావడంతో అందమైన అమ్మాయిలతో షికారు చేస్తూ ఉంటాడు. అతని ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అందమైన అమ్మాయిల అతడి చుట్టూ ఎప్పుడూ ఉంటారు. (ఫోటో: Instagram/danbilzerian)