
ఈ రోజుల్లో కేక్ తినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా కేక్‌ని ఇష్టపడతారు. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే చాలు.. ఆ ఫంక్షన్ లో కేక్ ఉండాల్సిందే.దుకాణాల్లో తయారు చేసిన కేక్ సులభంగా దొరుకుతుంది. డబ్బులు తీసుకుని కేక్ ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ప్రజలు తమకు ఇష్టమైన కేక్‌ను తయారు చేయమని కూడా ముందస్తుగా ఆర్డర్ ఇస్తారు. ఏ డిజైన్ కేక్ కావాలన్నా దుకాణదారునికి చెప్పి తయారు చేయించుకుంటారు. మార్కెట్‌లో అనేక రకాల కేక్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రత్యేకమైన, అద్భుతమైన కేక్‌తో ప్రజలను ఆశ్చర్యపస్తున్న అమెరికాకు చెందిన బేకర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అమెరికాలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మరియన్ సర్కిసియన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేకులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె చేసిన కేక్‌లు ప్రజలను కట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు కేక్‌ల తయారీకి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.పెళ్లి, పుట్టినరోజు వంటి వేడుకలకు కేక్స్ కోసం ఆర్డర్లు అందుకుంటున్నది.

మీడియా నివేదికల ప్రకారం, మరియన్ గతంలో లాస్ ఏంజిల్స్‌కు చెందిన కంపెనీలో కార్యదర్శిగా పనిచేసింది. ఈ సమయంలో, ఆమె బ్రిటన్‌లో కేక్‌ల తయారీలో ఒక వారం కోర్సుని అభ్యసించింది. అనంతరం ఆమె కేక్‌ల తయారీని ఆస్వాదించడం ప్రారంభించింది. దీంతో తన ఉద్యోగాన్ని వదిలివేసి పూర్తిగా కేక్స్ తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

మొదట్లో, మారియన్ సాధారణ కేక్‌లనే తయారు చేసేది. ఇలాంటి కేక్స్ ఇతర ప్రదేశాలలో కూడా దొరుకుతాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె వ్యాపారం నెమ్మదించడం ప్రారంభించింది. దీంతో ఆమె సరికొత్త ఆలోచన చేసింది. కేక్‌కి రకరకాల ఆకారాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అరటిపండు ఆకారంలో, కొన్నిసార్లు ఓవెన్ ఆకారంలో ఇలా రకరకాల షేప్స్ లో కేక్‌లను తయారు చేయడం ప్రారంభించింది. ఆమె ఆలోచన.. కేక్స్ రూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి

సోషల్ మీడియాలో మరియన్ చేసిన కేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి, వీటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్నెట్‌లో అరటిపండు ఆకారంలో ఉన్న వీడియో ఆమెకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఆమె దువ్వెన, షూ , డైరీ వంటి అనేక ఆకృతులలో కేక్‌లను తయారు చేస్తోంది.

महिला ने नौकरी छोड़ केक बनाने का शुरू किया बिजनेस