Weird Laws: ఆ దేశంలో విచిత్రమైన చట్టాలు.. బహిరంగంగా అరచినా, చేతులు పట్టుకుని నడిచినా అరెస్ట్.. జైలు శిక్ష

|

Jul 24, 2023 | 12:20 PM

కొందరు పరిసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ఒక మహిళ బహిరంగ ప్రదేశంలో గట్టిగా అరచినందుకు అరెస్ట్ చేశారు. అంతేకాదు జైల్లో కూడా పెట్టారు. ఈ విచిత్ర ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. ఈ దేశంలో ఇదొక్కటే కాదు అనేక విచిత్ర చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి.   

1 / 5
అరవడం చట్టరీత్యా నేరమా? అంటే ఎవరైనా 'నో' అని చెబితే 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అని పిలువబడే దుబాయ్ లోని చట్టాలపై ఓ లుక్ వేయండి. నిజానికి అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ఓ మహిళను దుబాయ్ లో    బహిరంగ ప్రదేశంలో అరుస్తుందనే ఆరోపణలపై అరెస్టు చేసి జైలుకి తరలించారు. ఇటువంటి చట్టాలు అక్కడ సాధారణం అయినప్పటికీ.. ఇదే మాత్రమే కాదు అనేక వింత చట్టాలు దుబాయ్‌లో చాలా ఉన్నాయి, అవి చాలా విచిత్రమైనవి, అలాంటి కొన్ని వింత చట్టాల గురించి తెలుసుకుందాం...

2 / 5
భారత్‌తో సహా పలు దేశాల్లో జంటలు బహిరంగంగా రొమాన్స్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం సర్వసాధారణం.. అయితే ఇలా చేయడం దుబాయ్‌లో తప్పే. ఈ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో జంటలు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం నిషేధించబడింది. అంతే కాదు జంట ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచినా  అది చట్ట విరుద్ధమే.. దీంతో ఆ జంటను అరెస్ట్ కూడా చేస్తారు. 

3 / 5
దుబాయ్‌లో అబ్బాయి, అమ్మాయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం నేరంగా పరిగణించబడుతుంది. మన దేశంలో విదేశీ ప్రభావంతో ఇప్పుడిప్పుడే అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు.. అయితే దుబాయ్‌లో అలా కాదు. స్త్రీ, పురుషులు కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదని ఇక్కడి చట్టం చెబుతోంది. ఇలా నివసిస్తూ పట్టుబడితే శిక్షకు అర్హులవుతారు.

4 / 5
దుబాయ్‌లో దుస్తులు ధరించే విషయంలో కూడా చట్టం ఉందని అంటున్నారు. ఇక్కడ అబ్బాయిలు, స్త్రీలు కనీసం బాలికలైనా సరే తమ శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే విధంగా దుస్తులు ధరించి మాత్రమే బహిరంగ ప్రదేశాలకు రావాల్సి ఉంటుంది. అవును, మీరు వాటర్ పార్క్, బీచ్ లేదా స్విమ్మింగ్ కోసం వెళ్లినా సరే దుస్తుల విషయంలో నిబంధనలు పాటించాల్సిందే. అయితే చాలా దేశాలలో బట్టలకు సంబంధించి ఇలాంటి చట్టం లేదు.

5 / 5
దుబాయ్‌లోని రాజకీయ లేదా సైనిక భవనాల చిత్రాలను తీయడం కూడా నిషేధం. అంతే కాదు ఎవరైనా సరే వ్యక్తి అనుమతి లేకుండా అతని ఫోటోలు కూడా తీయలేరు. అలా చేయడం నేరం కిందకు వస్తుంది..  ఎవరైనా అలా చేస్తే కఠినంగా శిక్షిస్తారు. 