5 / 5
ఈశాన్య అమెరికాలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇక.. కనెటికట్, మస్సాచుసెట్స్, న్యూహాంప్‌షైర్, న్యూయార్క్, రోడే దీవిలో టోర్నడోలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.