Tallest Monuments: ఇవి ప్రపంచంలోనే 5 ఎత్తైన స్మారక చిహ్నాలు.. వీటిని తప్పక చూడాలి..

Updated on: Jun 02, 2025 | 11:25 AM

అద్భుతమైన నిర్మాణ శైలి, చరిత్రను ప్రదర్శించే ప్రపంచంలోని ఎత్తైన స్మారక చిహ్నాలు చాల ఉన్నాయి. ఈ ఆకాశమంత ఎత్తైన అద్భుతాలను ప్రతి ప్రయాణికుడు తప్పక చూడాలి. మరి అందులో టాప్ 5 ఎత్తైన విగ్రహాలు ఏంటి.? వాటి ఎత్తు ఎంత.? అవి ఎక్కడ ఉన్నాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి.. 

1 / 5
స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఇండియా: స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది భారతదేశంలోని గుజరాత్‌లో ఉంది. ఇండియాకి చెందిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం దీనిని నిర్మించారు. ఇది 182-మీటర్లు (597 అడుగులు) ఎత్తు ఉంటుంది.

2 / 5
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, చైనా: ఈ విగ్రహం చైనాలో ఉంది. ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఎత్తు దాదాపు 153 మీటర్లు ఉంటుంది. దీనిని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇది ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి.

3 / 5
లేక్యున్ సెట్క్యార్, మయన్మార్: లేక్యున్ సెట్క్యార్ అనేది మయన్మార్‌లోని నిలబడి ఉన్న బుద్ధ విగ్రహం. ఇది దాదాపు 130 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. క్యుక్తవ్గి బుద్ధ అనే మరొక పెద్ద విగ్రహం సమీపంలో ఉంది.

4 / 5
ఉషికు దైబుట్సు, జపాన్: ఉషికు దైబుట్సు జపాన్‌లో ఉంది. ఇది బుద్ధుని విగ్రహం. ఇది 120 మీటర్ల ఎత్తు ఉంటుంది. మీరు విగ్రహం లోపలికి వెళ్లి పై అంతస్తు నుంచి అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.

5 / 5
గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్, థాయిలాండ్: బిగ్ బుద్ధ అని కూడా పిలువబడే ఈ విగ్రహం థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉంది. ఇది దాదాపు 92 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఒక కొండపై నిర్మించబడింది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి దీన్ని చూడవచ్చు.