PM Modi Egypt Visit: వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత అల్‌ హకీం మసీదును సందర్శించిన ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన..

|

Jun 25, 2023 | 4:19 PM

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టుకు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రదేశాలను సందర్శించారు.

1 / 8
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఈజిప్టు రాజధాని కైరోకు చేరుకున్నారు. రెండు రోజులలో భాగంగా ప్రధాని మోదీ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని ముస్తాఫా మద్‌బౌలి స్వయంగా వచ్చ ఘన స్వాగతం పలికారు.

2 / 8
ఈజిప్టు రాజధాని కైరోలో గార్డులు ప్రధాని మోదీకి గౌరవ వందనం చేశారు. ఈ పర్యటన ఈజిప్టుతో బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న నమ్మకం నాకుందని.. తనకు స్వాగతం పలికిన ఈజిప్టు ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

3 / 8
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం దక్కింది.  ఈజిప్టులో ఎంతో ప్రతిష్ఠ్మాక అవార్డు'ఆర్డర్ ఆఫ్ ది నైలు'ను ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా చేశారు.

4 / 8
ప్రధాని మోదీ తన ఈజిప్టు పర్యటనలో రెండో రోజైన ఆదివారం (జూన్ 25) అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు ఈజిప్టు రాజధాని కైరోలో ఉంది.

5 / 8
భారత సంతతికి చెందిన బోహ్రా కమ్యూనిటీ సభ్యుడు షుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఈజిప్టు ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని.. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అల్-హకీమ్ మసీదు వద్ద) ఇక్కడకు వచ్చి మాతో మాట్లాడారు. అతను మా బోహ్రా కమ్యూనిటీ శ్రేయస్సు గురించి కూడా ఆరా తీశారు. ప్రధాని మోదీ మా కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నాం.. అని తెలిపారు.

6 / 8
అల్‌- హకీం- మసీదు వద్ద ప్రధాని మోదీకి భారీ ఎత్తున ఈజిప్టు ప్రజలు స్వాగతం పలికారు.

7 / 8
11వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ  పనులను దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు మోదీకి వివరించారు.

8 / 8
దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును కూడా ప్రధాని మోదీ ఆదివారం సందర్శించిన సమయంలో ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు ఈజిస్ట్ ప్రజలకు క్యూ కట్టారు. ఫాతిమిడ్ రాజవంశం పాలనలో ఈ మసీదు నిర్మించారు.