- Telugu News Photo Gallery World photos Know us 9 11 attack america world trade centre unkown facts plane hijack september 11 osama bin ladon here details
భయంకరమైన అతి పెద్ద ఉగ్రదాడి.. హైజాక్ చేసిన విమానాలనే అమెరికాపై అస్త్రాలుగా వాడిన ఉగ్రవాదులు.. ఈ విషయాలు మీకు తెలుసా..
సెప్టెంబర్ 11న 2001లో అమెరికాపై అతి పెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 3000 మందికి పైగా మరణించారు. ఆరోజున 19 మంది ఉగ్రవాదులు దాదాపు నాలుగు విమానాలను హైజాక్ చేసి వాటిని క్షిపణులుగా ఉపయోగించి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Updated on: Sep 11, 2021 | 9:25 PM

హైజాక్ చేసిన రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి చేశారు. దీంతో అందులో దక్షిణ, ఉత్తరవైపు ఉన్న రెండు టవర్లు కూలిపోయాయి. డిసెంబర్ 19న 2001వరుకు ఆ మంటలను ఆర్పివేయలేకపోయారు. దాదాపు 99రోజుల పాటు మంటలు కొనసాగాయి.

1998లోనే అమెరికా నిఘా సంస్థ CIA అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో బిన్ లాడెన్ అమెరికన్ విమానాలను హైజాక్ చేయడానికి, ఇతర దాడులు చేయడానికి సిద్ధమవుతున్నాడని హెచ్చరిక వచ్చింది. యూసఫ్, ఇతర ఉగ్రవాదులను విడిపించడానికి లాడెన్ అమెరికా విమానాలను హైజాక్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా 1998 డిసెంబర్ 4న CIA తన రోజువారీ బ్రీఫింగ్‌లో అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు తెలిపారు.

ఫిబ్రవరి 26, 1993 న వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌లో ఆగి ఉన్న వ్యాన్‌లో బాంబును అమర్చారు. ఆ బాంబు పేలిన ఘటనలో ఆరుగురు మరణించారు దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డారు. బాంబులను అమర్చిన సున్నీ తీవ్రవాది రంజీ యూసఫ్ తరువాత 250,000 మంది చనిపోతారని తాను ఊహించానని చెప్పాడు.

దాడి తర్వాత మిగిలిన 185,101 టన్నుల ఉక్కు అమెరికా అంతటా స్మారక కట్టడాలను నిర్మించడానికి ఉపయోగించబడింది. కానీ అందులో కొంత భాగం చైనా, భారతదేశానికి విక్రయించారు.

రెండు విమానాలు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ప్రసిద్ధ ట్విన్ టవర్స్‌ను ఢీకొన్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ 7 (9/11 దాడి తేదీ)లో ఏమీ మిగలలేదు. అది దాదాపు 47 అంతస్తుల భవనం. ఇది ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత కూలిపోయింది.

గతంలోని నివేదిక ప్రకారం CIA , ఇతర ఏజెన్సీలు 1998 లో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కూడా చంపడానికి ప్రయత్నించాయి. కానీ అలా చేయడంలో ఆలస్యం జరిగింది మరియు ఆఫ్ఘన్ గిరిజన నాయకులను నమ్మడానికి అధికారులు చాలా భయపడ్డారు. బిన్ లాడెన్ పట్టుబడితే అతని పరిస్థితి ఏమిటి, అతనిపై ఉన్న సాక్ష్యాలు యుఎస్ కోర్టులో నేరారోపణను నిర్ధారించడానికి సరిపోతాయా అని జాతీయ భద్రతా సలహాదారు శాండీ బెర్గర్ ఆందోళన చెందారు.

హైజాక్ చేయబడిన నాలుగు విమానాల ప్రయాణికులు అమెరికన్ 11, యునైటెడ్ 175, అమెరికన్ 77, యునైటెడ్ 93 సెల్ ఫోన్‌ల నుండి తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కాల్ చేశారు. అతను ఉగ్రవాదులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. హైజాక్ చేయబడిన విమానాలను ఎందుకు ట్రాక్ చేయలేకపోయారో అర్థం చేసుకోవడానికి ఈ విషయం చాలా ఉపయోగపడింది.





























