
మైసూర్.. కర్ణాటకలోని చాముండి హిల్స్ దగ్గర స్కైడైవింగ్ బేస్ ఉంది. దాదాపు 3 గంటలు సమయం తీసుకునే టాండమ్ జంప్ ల కోసం ఇది సరైన ప్రదేసం.. కానీ ఇక్కడ స్కైడైవింగ్ చేయడానికి ముందు రోజు ప్రాక్టీస్ చేయాలి.. దాదాపు 4000 అడుగుల నుంచి ఒంటరిగ దూకేందుకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ పది జంప్స్ చేయవచ్చు. ధర.. Tandem – Rs 35,000, Accelerated Free Fall – Rs 2,50,00

ధన.. మధ్యప్రదేశ్‌లో ధన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ విమానం పైనుంచి దూకుతున్నప్పుడు మీతోపాటు మీ ట్రైనర్ కూడా ఉంటాడు. మొదటి సారి ప్రయత్నించేవారికి సరైన ఎంపిక. ఇక్కడ టెన్డం జంప్ కు గ్రౌండ్ శిక్షణ అవసరం లేదు. ధర.. Tandem Jump- Rs 37,500, Static Jumps – INR 24,000

నార్నాల్.. హర్యానాలోని నార్నాల్ లోని బచోడ్ ఎయిర్ స్ట్రిప్‌లో ఈ అడ్వెంచర్ స్కైడైవింగ్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రైనర్ లేకుండా డైవ్ చేయాలనుకుంటే వారికి స్టాటిక్ లైన్ జంప్స్ లేదా త్రాడు కడతారు. దీంతో ఒంటరిగానే డైవ్ చేయవచ్చు. అలాగే పారచూట్స్ కూడా ఉంటాయి. ధర.. Static Line Jumps – Rs 18,500, Tandem Jumps – Rs 27500

దీసా.. గుజరాత్సో ఈ లేకే సైడ్ సిటీలో దీసా ప్రదేశం ఉంది. ఇక్కడ టెన్డం, ఎఎఫ్ఎఫ్ తోపాటు స్టాటిక్ లైన్ జంప్స్ వంటి మూడు రకాల జంప్స్ చేయవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్.. ఇండియన్ పారాచూటింగ్ ఫెడరేషన్ ఈ ప్రాంతంలో ఔత్సాహికుల కోసం క్యాంపులను ప్లాన్ చేస్తున్నారు. ధర.. Static Line Jumps – Rs 16,500, Tandem – Rs 33,500, AFF – Rs 37,500

పాండిచ్చేరి.. తమిళనాడులోని పాండిచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్క్రైడవింగ్ చేయ్యోచ్చు. ఇక్కడ రకరకాల స్కైడైవింగ్స్ చేయ్యోచ్చు. ఇందుకు మీరు సౌకర్యవంతమైన దుస్తులు.. స్పోర్ట్స్ షూలను ధరించాలి. ధర.. Static Jumps – Rs 18,000 for one experience and 62,000 for 5 jumps, Tandem Jump – Rs 27,000