ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. త్వరలోనే అందుబాటులోకి.. ఎక్కడుందో తెలుసా..

|

Feb 13, 2022 | 6:43 PM

ప్రపంచంలో అనేక రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో కొన్ని అల్లాంత ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని రైల్వే బ్రిడ్జిల కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జి సిద్ధమవుతుంది. అది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలు ఎంటో తెలసుకుందామా.

1 / 7
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన భారతదేశంలోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో చీనాబ్ రైలు వంతెన ముఖ్య పాత్ర పోషిస్తుంది.

2 / 7
ప్రస్తుతం కాశ్మీర్ నుంచి ఢిల్లీకి రావడానికి ట్రక్కులను 48 గంటల సమయం పడుతుంది. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్వ ద్వారా కేవలం 20-22 గంటల్లోనే కాశ్మీర్ సరుకులు ఢిల్లీకి చేరుకుంటాయి. దీంతో సరుకుల రవాణా ఖర్చు తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. అలాగే కాశ్మీరీ సరుకులు చౌకగా లభిస్తాయి.

3 / 7
ఈ బ్రిడ్జి ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కాశ్మీరు చేరుకోవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చీనాబ్ రైలు బ్రిడ్జి ఫోటోస్ షేర్ చేసింది. అందులో వంతెన కింద మేఘాలు కనిపిస్తున్నాయి. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

4 / 7
చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఎత్తు 359 మీటర్లు. ఇది అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనాను ప్రతిబింభిస్తుంది.  ఈ బ్రిడ్జి జమ్మూ, కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో ఉంది. ఇది ప్రధాన లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. దీని నిర్మాణానికి దాదాపు 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ వంతెన బలమైన గాలులతోపాటు. భూకంపాలను తట్టుకుంటుంది.

5 / 7
చీనాబ్ రైలు వంతెన డిసెంబర్ 2009లో సిద్ధమవుతుందని గతంలో తెలిపారు.. అయితే, సెప్టెంబరు 2008లో, వంతెన యొక్క స్థిరత్వం, భద్రత గురించిన ఆందోళనల కారణంగా ప్రాజెక్ట్ నిలిపివేశారు. ఆ తర్వాత 2010లో మరోసారి వంతెన పనులు ప్రారంభించారు. 2010లో మళ్లీ దీని పనులు ప్రారంభం కాగా, 5 ఏళ్లలో అంటే 2015 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించగా, ఎప్పటికప్పుడు తలెత్తుతున్న పలు సమస్యలతో సాధ్యం కాలేదు.

6 / 7
జమ్మూ కాశ్మీర్‌లో నిర్మిస్తున్న ఈ వంతెనలో నాణ్యమైన ఉక్కు,  కాంక్రీటును ఉపయోగిస్తున్నారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకోగలదంటే ఈ వంతెన బలాన్ని అంచనా వేయవచ్చు. ఈ వంతెన నిర్మాణ కాంట్రాక్టును ఆఫ్కాన్స్ సంస్థకు అప్పగించారు. దీని నిర్మాణంలో కొంకణ్ రైల్వే,  DRDO కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

7 / 7
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. త్వరలోనే అందుబాటులోకి