భూమిపైకి ముంచుకొస్తున్న సౌర ప్రమాదం.. ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతుందంటున్న శాస్త్రవేత్తలు..

|

Sep 05, 2021 | 12:59 PM

సౌర తుఫాను 2021 గురించి గత కొద్ది కాలంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన ఇంటర్నెట్ పూర్తిగా షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. చివరిసారిగా ఈ ప్రమాదం 1989లో జరిగింది. మరోసారి ఈ ప్రమాదం జరగబోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.

1 / 6
 సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన భూమికి అతిముఖ్యమైన శక్తినిచ్చే వనరు. భూమిపై  ఉన్న జీవరాశులకు బతకడానికి వేడి, కాంతి అందించడమే కాకుండా.. ప్రతి గ్రహానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది.

2 / 6
అలాగే బాహ్య అంతరిక్షం అత్యంత అస్థిర ప్రాంతం. ఇక్కడ నిరంతరం విశ్వ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సూర్యుడిలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.  దీనినే సౌర తుఫాన్ అని కూడా పిలుస్తారు. త్వరలోనే ఈ తుఫాన్ మళ్లీ జరగబోతుందని శాస్త్రవేత్తలు అంటుంటారు.

3 / 6
 సూర్యుడి ఉపరితలంపై  జరిగే విస్పోటనంతో సూర్య కాంతి వెలువడుతుంది. విస్పోటనం ద్వారా పెద్ద మొత్తంలో అయస్కాంత శక్తిని విడుదల చేస్తుంది. దీని వలన సూర్యుడి బాహ్య ఉపరితలం కొంత భాగం తెరుచుకుంటుంది. ఇది అగ్ని గోళంగా కనిపిస్తుంది. ఇందులో నుంచి అణు కణాలు  విడుదలవుతాయి. ఈ కణాలు విశ్వంలో పూర్తి శక్తితో వ్యాప్తి చెందుతాయి. దీనిని సౌర తుఫాను అంటారు.

4 / 6
అనేక రకాల సౌర తుఫానులు సంభవించడమనేది.. వాటి నుంచి విడుదలయ్యే శక్తిపై  ఆధారపడి ఉంటాయి. ఇవి అత్యంత సాధారణ సూర్య కాంతి. సూర్యుడి బాహ్య వలయం ద్వారా సోలార్ శక్తి ఉత్పన్నమవుతుంది.

5 / 6
ఇక ఈ సూర్య కాంతి తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈవెంట్ లేదా ఒక సీఎంఈ ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం నుంచి బయటకు వచ్చే అయనీకరణ కణాలలో భారీగా విస్పోటనం జరుగుతుంది. ఈ సమయంలో దాని మార్గంలో ఉన్న వాటిని ఇది పూర్తిగా కవర్ చేస్తుంది.

6 / 6
సీఎంఈ కారణంగా అయనీకరణం చెందిన కణాలు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాన్ని నాశనం చేయగలవు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయే అవకాశం ఉంది. సౌర తుఫాను ఇలాంటి పెద్ద నష్టాలను కలిగించడమనేది చాలా అరుదు. ఇలాంటి  అతి పెద్ద తుఫాన్ చివరి సారిగా 1989లో సంభవించింది. ఇక ఈ ఏడాదిలో కూడా ఈ భారీ తుఫాన్  వచ్చే అవకాశం ఉందని.. దీని వలన ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా వినాశనం కాబోతుందని  శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.