నవల స్ఫూర్తితో నిర్మించిన భవనం ఇది.. ఏకంగా 900 మొక్కలతో అడవినే సృష్టించాడు

|

Jul 06, 2023 | 2:45 PM

ఇటలీలోని మిలాన్‌ నగరంలో ‘బాస్కో వర్టికల్’ టవర్లు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌. ఇక్కడ దాదాపు 80, 112 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఉంటాయి. ఈ టవరల్లో ప్రతి అంతస్తులో అడవిని తలపించేలా చెట్లు, మొక్కలు దర్శనమిస్తాయి. అందుకే..

1 / 5
ఇటలీలోని మిలాన్‌ నగరంలో ‘బాస్కో వర్టికల్’ టవర్లు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌. ఇక్కడ దాదాపు 80, 112 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఉంటాయి. ఈ టవరల్లో ప్రతి అంతస్తులో అడవిని తలపించేలా చెట్లు, మొక్కలు దర్శనమిస్తాయి. అందుకే ఈ టవర్స్‌కు ‘వర్టికల్ ఫారెస్ట్‌' అని పిలుస్తుంటారు. కృత్రిమంగా అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన అడవి ఇది.

2 / 5
బోరి స్టూడియో అనే కంపెనీ ‘బాస్కో వర్టికల్’ టవర్లను డిజైన్‌ చేసింది. వీటి నిర్మాణానికి ఉద్యానవన నిపుణులు, వృక్ష శాస్త్రజ్ఞుల సాయం తీసుకున్నారు. అందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. కేవలం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఆవాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టవర్లను రూపొందిచారు. 2010లో ప్రారంభమైన వీటి నిర్మాణ పనులు 2014 పూర్తయ్యాయి.

3 / 5
ఇటాలో కాల్వినో అనే రచయిత 1957లో ‘ద బారన్‌ ఇన్‌ ద ట్రీస్‌’ అనే నవల రాశాడు. ఈ నవల ఆధారంగా ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోరి ‘బాస్కో వర్టికల్’ టవర్లను రూపొందిచినట్లు తెలిపాడు. ద బారన్‌ ఇన్‌ ద ట్రీస్‌ నవలలో హీరో నేలపై కాకుండా చెట్లపై నివాసం ఉండాలనుకుంటాడు. ‘బాస్కో వర్టికల్’ రెండు టవర్లలో దాదాపు 900 చెట్లున్నాయి. ఒక టవర్‌లో 550, మరో టవర్‌లో 350 మొక్కలు నాటారు. వీటితోపాటు 15 వేల గ్రౌండ్‌ కవరింగ్‌, 5 వేల పొద రకాల మొక్కలు నాటారు.

4 / 5
దాదాపు 30వేల చదరపు మీటర్ల అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వృక్షాలను కేవలొం 3 వేల చదరపు మీటర్ల నగరంలో ఏర్పాటు చేయడం మరో విశేషం. చుట్టూ మొక్కలు ఉండటం వల్ల వేసవిలోనూ ‘బాస్కో వర్టికల్’ గదులు చల్లగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనమే కన్పించడం వల్ల ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఏసీల వాడకం కూడా తగ్గిందని స్థానికులు అంటున్నారు.

5 / 5
ఇక ‘బాస్కో వర్టికల్‌’ ప్రాజెక్టుకు రెండేళ్లకోసారి ప్రధానం చేసే ‘ఇంటర్నేషనల్ హై రైజ్‌ అవార్డు’ 2014లో వచ్చింది. 2015లో బెస్ట్‌ టాల్‌ బిల్డింగ్‌ వరల్డ్‌ వైడ్‌గా బాస్కో వర్టికల్‌ గుర్తింపు పొందింది. కొలంబియా రాజధాని బొగొటాలోని ఎడిఫిసియో శాంటాలాయా, చైనా దేశం చెంగ్డూలోని క్యూయీ సిటీ ఫారెస్ట్‌ గార్డెన్‌ దీని స్ఫూర్తిగా నిర్మించినవే. ప్రస్తుతం ‘బాస్కో వర్టికల్’ టవర్స్‌లో దాదాపు 1600 రకాల పక్షులు, సీతాకోక చిలుకలకు నిలయంగా మారింది.