
జంక్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు రుచికరమైన ఆహారానికి ఉన్న క్రేజ్ ప్రజలలో నిరంతరం పెరుగుతోంది. పిల్లలైనా, వృద్ధులైనా, ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంతో తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే వాటిల్లో కొన్నింటి విలువ మనం ఊహించలేనంతగా ఉంది. ప్రపంచంలోని ఖరీదైన ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో పిజ్జా అనేది అందరికీ ఇష్టమైన ఆహారాలలో ఒకటి. ఈ క్రమంలో మీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలంటే న్యూయార్క్ వెళ్లాల్సిందే.. అక్కడ పిజ్జా ఖరీదు రూ.1.5 లక్షలు. దీనికి 24 క్యారెట్ అని కూడా పేరు. ఇందులో గోల్డ్ చిల్లీ ఫ్లేక్స్‌ను ఉపయోగించడం వల్ల దీనికి మంచి డిమాండ్.

చికాగో(అమెరికా)లోని బెర్కో రెస్టారెంట్‌లో పాప్‌కార్న్ విలువ లక్షల్లో ఉంటుంది. ఇక్కడ 6.5 గ్యాలన్ల పాప్‌కార్న్ టిన్ ధర రూ.1,87,855. ఈ పాప్‌కార్న్‌లను 24 క్యారెట్ల బంగారంతో కప్పి, అందులో లెజో సాల్ట్‌ను ఉపయోగిస్తారు.

రూ.4.50 లక్షల విలువైన బర్గర్ ఎప్పుడైనా తిన్నారా..? అవును, నెదర్లాండ్స్‌లోని డి ఆల్టన్స్ వూర్తుయిజెన్ అనే రెస్టారెంట్‌లో ‘ది గోల్డెన్ బాయ్’ బర్గర్ విలువ అక్షరాల నాలుగున్నర లక్షలు. దీనిని చెఫ్ రాబర్ట్ జె డి వీన్ తయారు చేశారు.

దుబాయ్ స్కూపీ కేఫ్‌లో బ్లడ్ డైమండ్ ఐస్‌క్రీమ్ ధర ఏకంగా 60 వేల రూపాయలు. ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి కుంకుమపువ్వు, నలుపు ట్రఫుల్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇంకా దానిపై 23 క్యారెట్ల బంగారాన్ని పూతగా పూస్తారు.