
అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే గుండెను కాపాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి రోజూ కొన్ని రకాల యోగాసనాలు చేయాలి. ఆయా ఆసనాల కారణంగా గుండె పనితీరు మెరుగుపడి, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంతకీ ఆ ఆసనాలు ఏమిటంటే..?

భుజంగాసనం: గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆసనాల్లో భుజంగాసనం ప్రముఖమైనది. దీన్ని కోబ్రా భంగిమ అని కూడా అంటారు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

తడసనా: ప్రతిరోజూ ఉదయం తడసనా చేయడం వల్ల మీ హృదయ స్పందన మెరుగుపడుతుంది, అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ యోగాసనం గుండె వైఫల్యంతో బాధపడేవారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వృక్షాసనం: ఉదయం లేవగానే వృక్షాసనం వేయడం వల్ల మన శరీరానికి స్థిరత్వం, సమతుల్యత లభిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వీరభద్రాసనం: గుండెకు మేలు చేసే మరో ఆసనం వీరభద్రాసనం. దీనిని యోధుల భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, కాళ్ల మధ్య ఖాళీని ఏర్పరుచుకుంటూ నేలపై నిలబడి యోగా చేస్తారు. ఈ యోగాసనం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.