
వ్యాయామం చేసే సమయంలో చెమట పట్టడం వల్ల శరీరం బలహీనపడుతుంది. అయితే ఎక్కువ తిన్నా, వ్యాయామం చేసినా వాంతులు రావచ్చు. కనుక వ్యాయామానికి 30-45 నిమిషాల ముందు తినడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేయడానికి అరగంట ముందు తినడం మంచిది కదా అని అరగంట ముందు బిర్యానీ లేదా పులావ్, మాంసాహారం తిని వ్యాయామానికి వెళితే కానీ కష్టమే. ఐతే ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో ఈ రోజు తెలుసుకుందాం..

ఎక్సర్సైజులు చేయడానికి అరగంట ముందు అరటిపండ్లు తినవచ్చు. అరటిపండ్లలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు వ్యాయామం చేసే ముందు ఈ పండును తినడం వలన శక్తి లభిస్తుంది.

వ్యాయామం చేసే ముందు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. వివిధ రకాల గింజలు, డ్రై ఫ్రూట్స్ లేదా ఎండిన పండ్లలో యాంటీఆక్సిడెంట్లతో సహా వివిధ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

వ్యాయామానికి ముందు వివిధ విటమిన్లు, సులభంగా జీర్ణమయ్యే ఫైబర్, లాక్టిక్ యాసిడ్‌తో కూడిన పెరుగును తినవచ్చు. ఈ ఆహారం అపానవాయువు, గ్యాస్ లేదా వికారం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

వ్యాయామానికి అరగంట ముందు బ్రెడ్, వేరుశెనగ వెన్న మంచి ఆహారం కావచ్చు. గుడ్డు అలవాటు ఉన్నవారు వ్యాయామానికి మందు ఉడికించిన గుడ్డు తినొచ్చు.

వ్యాయామం చేసే ముందు ప్రొటీన్లు తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే చేపలు, మాంసం వంటి ఆహారం తినడం ప్రమాదకరం. బదులుగా వోట్మీల్ తినవచ్చు.