Nutmeg Powder: జాజికాయ నీళ్లు ఆరోగ్యానికి వరం.. ప్రతిరోజూ ఓ గ్లాసు తాగి చూడండి..

|

Aug 24, 2024 | 2:48 PM

జాజికాయ ప్రతి వంటింట్లో ఉండే ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అంతేకాదు.. దీనిని పలు రకాల ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేద పరంగా మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది. జాజికాయలో యాంటీబయాటిక్, యాంటీ ధర్మబోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు జాజికాయలో పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం , కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇన్ని రకాల ఖనిజాలు ఔషధగుణాలు నిండివున్న జాజికాయ నీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జాజికాయ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. గ్లాసు జాజికాయ నీటితో  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు అసౌకర్యం దూరం అవుతుంది.
అలాగే,  పంటి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. పంటి నొప్పితో బాధపడే వారికి కూడా జాజికాయ మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.

జాజికాయ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. గ్లాసు జాజికాయ నీటితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు అసౌకర్యం దూరం అవుతుంది. అలాగే, పంటి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. పంటి నొప్పితో బాధపడే వారికి కూడా జాజికాయ మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.

2 / 5
జాజికాయతో నిద్రలేమి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. అధిక ఒత్తిడి, బిజీ లైఫ్‌ కారనంగా కారణంగా చాలా మందిని నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. అయితే జాజికాయను తీసుకోవటం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
జాజికాయలో ఉండే ఔషధగుణాలు గుండెకు కూడా మేలు చేస్తుంది.  క్యాల్షియం పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే జాజికాయ వినియోగంతో గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు రాకుండా నివారిస్తుంది.  జాజికాయను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్ సదుపులో ఉంటాయి

4 / 5
జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మంపై వచ్చే దురద, మంటను తగ్గిస్తుంది. జాజికాయ యాక్నే నిర్మూలించడానికి కూడా తోడ్పడుతుంది. ముఖంపై మచ్చలు గీతాలు రాకుండా నివారిస్తుంది.

5 / 5
జాజికాయలో ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ గుణాల వల్ల మనకు ర్యూమటిజం వంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.  జాజికాయ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వల్ల అభిజ్ఞ పనితీరును మెరుగు చేస్తుంది. అధిక ఒత్తిడితో బాధపడేవారు  క్రమం తప్పకుండా జాజికాయ నీటిని తీసుకోవడం వల్ల స్ట్రెస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.