
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోడీ మహిళా ఎంపీలతో ఫొటో దిగారు. ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీలు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. బిల్లును ఆమోదించడంలో ప్రధాని మోడీ నిర్ణయాత్మక నాయకత్వం వహించారని పలువురు మహిళా సభ్యులు ప్రశంసించారు.

తాము మద్దతిచ్చిన చట్టాన్ని సంబరాలు చేసుకునేందుకు.. మార్పుకు నాంది పలికిన వారందరూ కలిసి రావడం హర్షణీయమని ప్రధాని మోడీ అన్నారు.

నారీ శక్తి వందన్ చట్టం ఆమోదంతో భారతదేశం మన నారీ శక్తితో ఉజ్వలమైన, మరింత సమ్మిళిత భవిష్యత్తుతో హిమాలయ శిఖరం వద్ద నిలుస్తుంది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో చారిత్రాత్మక ఘట్టమని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్‌లో ప్రధాని మోడీ అభివర్ణించారు. భారతదేశంలోని మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత యుగానికి తాము నాంది పలుకుతున్నామని ఆయన అన్నారు.

భారతదేశంలోని మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత శకానికి ఇది నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది నిర్ణయాత్మక ఘట్టమని మోడీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు చెప్పారు.

ఈ రోజు మనం జరుపుకుంటున్న సంబరాలతో మన దేశంలోని మహిళలందరి శక్తి, ధైర్యం, అలుపెరగని స్ఫూర్తిని మనం గుర్తు చేసుకుంటున్నామని ప్రధాన మంత్రి అన్నారు. ఈ చారిత్రాత్మక అడుగు మహిళల గొంతులను మరింత సమర్థవంతంగా వినిపించే నిబద్ధతతో ఉందని చెప్పారు.