1 / 8
చలికాలంలో శరీరం డీ హైడ్రేట్ కు గురవుతుంది. దీంతో చర్మం పొడిబారడం సర్వసాధారణం. దీని వల్ల ముఖం డల్ గా కనబడుతుంది. ఇది సాధారణ విషయం అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. చర్మం పొడిబారిన తర్వాత చర్మంలో పగుళ్లు కనిపించడం ప్రారంభిస్తాయి. దీనిని స్కిన్ క్రాకింగ్ అని కూడా పిలుస్తారు. అదే సమయంలో పొడి బారిన చర్మం దురద, బర్నింగ్, ఫ్లాకీ చర్మం, ఎరుపు వంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక శీతాకాలంలో చర్మం పొడిబారకుండా నిరోధించడానికి, సరైన చర్మ సంరక్షణ దినచర్యను పాటించడం చాలా ముఖ్యం. స్కిన్ పొడిబారడం తగ్గి ముఖం మెరిసిపోయెలా రకరకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతేకాదు వంటింటి నివారణ చిట్కాలను అనుసరిస్తారు.