ముఖంపై మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి తురుము నుంచి పాలు తయారు చేయవచ్చు. చర్మం, జుట్టు సంరక్షణలో కొబ్బరి పాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి పాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి, ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలలో కాపర్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇది జుట్టు, చర్మ సమస్యలను సులభంగా తొలగిస్తుంది.