
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని సార్లు ఇది సానుకూల ప్రభావాలను చూపిస్తే, మరికొన్ని సార్లు ప్రతికూలప్రభావాను చూపిస్తుంది. అయితే ఈ సంవత్సరం మార్చి 29 మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. శని మీన రాశిలోకి ప్రవేశించడం, అలాగే సూర్యుడు కూడా ఆ రాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రెండు గ్రహాల కలయిక అనేది చాలా ప్రభావం చూపింది.

బద్ధశత్రువులైన రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడిన సూర్యగ్రహణం, ప్రపంచపై తీవ్రపరిణామాలను సృష్టించిందనే చెప్పాలి. ఈ సూర్య గ్రహణం తర్వాత చాలా దేశాల మధ్య యుద్దాలు సంభవిచాయి. అలాగే భారత్, పాక్ మధ్య కూడా చిన్న పాటి యుద్ధం ప్రారంభమై, ముగిసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఇప్పుడు సెప్టెంబర్ 21న రెండో సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అశ్వని మాసం, అమావాస్య రోజున ఏర్పడుతుంది పితృపక్షం రోజున ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి, దీనిపై అంత ప్రభావం చూపెట్టదు. అయితే ఈసూర్య గ్రహణం కూడా ప్రపంచంపై తీవ్ర పరిణామాలనే చూపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మొదటి సూర్య గ్రహణం వలన యుద్ధాలు మొదలైతే, రెండో సూర్యగ్రహణం వలన రాజకీయ ప్రకంపనలు తప్పవని చెబుతున్నారు పండితులు. ఇది భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భయంకరమైన సునామీ , తుఫానులు, వంటి వాటికి దారితీయోచ్చునంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.