
నేటి రోజువారీ జీవన విధానంలో మొబైల్ ఫోన్లు కూడా ఓ భాగమై పోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతిదీ మొబైల్‌తో అటాచ్ అవడంతో ప్రతి ఒక్కరూ మొబైల్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

దీంతో రాత్రి నిద్రపోవడానికి కొన్ని గంటలు ముందు మొబైల్ తోనే గడుపుతున్నారు. దీంతో మొబైల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు కూడా మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోతే వెంటనే ఈ అలవాటును మానుకోండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి చాలా హానికరం మరియు ప్రమాదకరం. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలి కాంతి శరీరంలోని హార్మోన్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు ఇది చర్మంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరూ రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్‌తో గడుపుతుంటే వెంటనే ఈ అలవాటును మానుకోవడం మంచిది. ఇది మీ కళ్ళను నేరుగా ప్రభావితం చేస్తుంది. క్రమంగా దృష్టి సమస్యలను కలిగిస్తుంది.

దీనితో పాటు మీరు నిద్రపోతున్నప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తే నిద్ర సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ఈ సమస్య తీవ్రతరమై నిద్రలేమికి కారణమవుతుంది. ఇది నిద్రపోవడంలో కూడా సమస్యలను సృష్టిస్తుంది.