
గుమ్మడికాయ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడిలోని విటమిన్లు, ఖనిజాలు, ఆహార ఫైబర్‌తో నిండిన బూడిద గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి.

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది.

బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది.

గుమ్మడి జ్యూస్ తీసుకోవటం వల్ల ఉబకాయాన్ని నిరోధిస్తుంది. కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది.