
బిస్కెట్లను ఎల్లప్పుడూ టీతోనే ఎందుకు తింటారు? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. బిస్కెట్లు, స్వీట్లు రెండూ తీపి ఆహారాలు. కానీ స్వీట్లను మాత్రం ఎప్పుడూ టీతో కలిపి తీసుకోరు. బిస్కెట్లను మాత్రమే టీతో తినేందుకు ఇష్టపడతారు. నిజానికి దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే..

టీతో బిస్కెట్లను ఆస్వాదించడం మనలో చాలా మందికి అలవాటు. నిజానికి ఈ కాంబినేషన్ బ్రిటిష్ వారితో ముడిపడి ఉంది. బ్రిటన్‌లో బిస్కెట్లను టీతో తేలికపాటి చిరుతిండిగా తింటారు.

టీ మొదట చైనా నుంచి బ్రిటన్‌కు వచ్చింది. ఆ తర్వాత టీతో బిస్కెట్లు తినే సంప్రదాయం బ్రిటన్‌లో ప్రారంభమైంది. టీతో బిస్కెట్లు వడ్డించే సంప్రదాయం భారత్‌తోపాటు బ్రిటన్‌లోనూ చాలా కాలంగా కొనసాగుతోంది.

బిస్కెట్ ని టీలో ముంచినప్పుడు, అది వెంటనే మెత్తగా అవుతుంది. బిస్కెట్ లోని గ్లూటెన్, స్టార్చ్ వెంటనే మెత్తగా అవుతాయి. దీనివల్ల తినడానికి సులభం అవుతుంది. బిస్కెట్ క్రంచీనెస్, టీ తీపి వింత రుచిని ఇస్తుంది. అందుకే బిస్కెట్లను టీతో కలిపి తింటారు. బిస్కెట్ ని టీలో ముంచకుండా కూడా చాలా తక్కువ సమయంలో తినవచ్చు.

అయితే ఆరోగ్యకరమైన జీవనశైలికి బిస్కెట్-టీల కాంబినేషన్ అంత మంచిదికాదు. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే జిగట, టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. టీలోని ఆమ్లతత్వం, బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం, యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ చేస్తాయి.