Crocodile Facts: మొసళ్లు ఆహారాన్ని నమలకుండా మింగేస్తాయి ఎందుకు? ఆసక్తికరమైన వాస్తవాలు మీకోసం..!

Updated on: Jul 16, 2022 | 9:05 AM

Crocodile Facts: మనుషులనైనా, ఇతర జీవిని వేటాడినా మొసలి తన ఆహారాన్ని నమలకుండా నేరుగా మింగేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ సీన్స్ చూసే..

1 / 5
Crocodile Facts: మనుషులనైనా, ఇతర జీవిని వేటాడినా మొసలి తన ఆహారాన్ని నమలకుండా నేరుగా మింగేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ సీన్స్ చూసే ఉంటాం. మరి మొసలికి దంతాలు ఉన్నప్పటికీ.. అవి ఎందుకు నమలవు? అని ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం తన ఆహారాన్ని దవడల మధ్య వత్తి.. ఆపై మింగేస్తుంటుంది. ఇతర జీవుల మాదిరిగా నమలి తినదు. దీని వెనుకల గల కారణం ఏంటో.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
శాస్త్రవేత్తల ప్రకారం.. మొసలి దవడలు చాలా బలంగా ఉంటాయి. మొసలి వేటాడిన సమయంలో దాని దవడకు చిక్కితే ఇక పని అయిపోయినట్లే. దాని నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నోటికి చిక్కిన జీవిని సునాయాసంగా నీటిలోకి లాక్కెళుతుంది.

3 / 5
మొసలి నోటిలోని దంతాల నిర్మాణం.. ఎరను పట్టుకునేలా మాత్రమే ఉంటుంది కానీ, నమలడానికి సాధ్యం అవదు. మొసళ్లకు పక్క దంతాలు ఉంటాయి. వీటి కారణంగా మొసళ్లు నమలలేవు. అలాగని నేరుగా మింగనూ లేవు. వేటాడిన జీవిని దవడతో విచ్చిన్నం చేస్తుంది. అనంతరం నేరుగా మింగేస్తుంది. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే.. మొసలికి నాలుగు జీర్ణాశయాలు ఉంటాయి.

4 / 5
ఇతర జీవులతో పోలిస్తే, మొసలి కడుపులో ఎక్కువ గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి పనిచేస్తుంది. మొసళ్లు చిన్న చిన్న గులకరాళ్లను కూడా తింటాయని మియామీ సైన్స్ మ్యూజియం నిపుణులు చెబుతున్నారు. అవి కడుపులోకి వెళ్లిన ఆహారాన్ని రుబ్బుతాయని చెబుతున్నారు. ఈ రాళ్ళు ముఖ్యంగా మొసళ్ళు తిన్న సముద్ర జీవులను జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

5 / 5
నిపుణుల ప్రకారం.. మొసలి ఏది తిన్నా.. ఆహారం దాని కడుపులో దాదాపు 10 రోజుల పాటు నెమ్మదిగా జీర్ణమవుతుంది. మొసలి పెద్ద జంతువును తిన్నప్పుడు.. అది కొంతకాలం వరకు వేటాడదు. శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ జరుగుతున్నందున అది ప్రశాంతంగా ఉంటుంది.