
యాపిల్స్ గోధుమ రంగులోకి మారకుండా, తాజాగా ఉంచడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక పాత్రలో నీరు, నిమ్మరసం వేసి, ఆపై ఆపిల్‌ను కట్ చేసి అందులో ముంచాలి.

యాపిల్ ను ఇలా లెమన్ వాటర్ లో 5నిమిషాలు ఉంచిన తర్వాత బయటకు తీసి తుడిచి లంచ్ బాక్స్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది.

ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా నిరోధించడానికి ఉప్పు కూడా ఉపయోగపడుతుంది.. దీని కోసం, ఒక పాత్రలో నీరు తీసుకుని, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. దీని తరువాత యాపిల్ కట్ చేసి ముక్కలు ఆ ఉప్పునీటిలో ముంచాలి.

ఉప్పు ఒక సంరక్షణకారి. ఇది ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా చేస్తుంది. ఆపిల్‌ను 5 నిమిషాలు నీటిలో ఉంచిన తర్వాత, దానిని ఫిల్టర్ చేసి ఆరబెట్టండి. దీంతో గంటల తరబడి కూడా యాపిల్ రంగు మారదు.

యాపిల్‌ను తాజాగా ఉంచడానికి సోడా కూడా ఉత్తమ ఎంపిక. దీని కోసం, ఒక పాత్రలో నిమ్మరసం, నిమ్మ సోడా, అల్లం రసం కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసి,అందులో తరిగిన యాపిల్ ముక్కలను వేయాలి.

సోడాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. యాపిల్ గోధుమ రంగులోకి మారకుండా చేస్తుంది. యాపిల్‌ను సోడా ద్రావణంలో 5 నిమిషాలు ఉంచి, ఆపై దానిని ఆరబెట్టి టిఫిన్‌లో పెట్టుకోండి. దీని కారణంగా యాపిల్ గోధుమ రంగులోకి మారదు. చాలా తాజాగా ఉంటుంది.

ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. ఆపిల్స్ ఎక్కువ టైమ్ తాజాగా ఉంటాయి. ఇక మీరు ఎలాంటి అపోహలు లేకుండా ప్రతిరోజు ఆపిల్స్ కోసుకుని మీ లంచ్‌బాక్స్‌లో తెచ్చుకోవచ్చు..