
అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కొబ్బరి నీళ్ళు తాగడం కొంతమందికి హానికరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వారిలో ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు.

డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు. కొబ్బరి నీళ్ళలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో అందులో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కొంతమందికి కొబ్బరి నీళ్లతో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివాళ్లకు కొబ్బరి నీళ్ల వల్ల చర్మంపై దురద, ఎరుపుదనం కలుగుతుంది. అందువల్ల, కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత వాపు లేదా అలాంటి సమస్య ఉన్నవారు దీనిని తినకూడదు.

కొంతమందికి కొబ్బరి లేదా కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం హానికరం. కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ ఉంటే, దూరంగా ఉండటమే మేలు.

మీరు ఉదయం తీసుకునే టీ, కాఫీని కొబ్బరి నీటితో భర్తీ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి, కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, మీరు వారానికి 3 రోజులు మాత్రమే కొబ్బరి నీళ్ళు తాగినా, అది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.