
జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే ఈ పండు ఎంత ఆరోగ్యకరమైనదైనా, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేగు సమస్యలు ఉన్నవారు: జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, పేగు సమస్యలు లేదా గ్యాస్, విరేచనాలు వంటి కడుపు సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత ఇబ్బంది కలిగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం.. అధిక ఫైబర్ కంటెంట్ ఈ సమస్యలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి పేగు సమస్యలు ఉన్నవారు జామకాయ తినకూడదు

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. జామకాయలో అధికంగా ఉండే పొటాషియం మూత్రపిండాల సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. అందువల్ల, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు జామకాయను ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది.

Guava

జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. కానీ లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, దీనిని తినే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.