
జీర్ణ సమస్యలు ఉన్నవారు: మీకు జీర్ణ సమస్యలు ఉంటే, మీరు ఉసిరి రసం తాగకూడదు. ఉసిరికాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున, దాని ఆమ్లత్వం జీర్ణవ్యవస్థను చికాకుపెడుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటకు కారణం కావచ్చు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: ఉసిరి రసంలో అధిక పొటాషియం ఉంటుంది. అందువల్ల, మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, మీరు ఉసిరి రసం తాగకుండా ఉండాలి. లేదంటే కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇందులో ఉండే విటమిన్ సి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది.

అసిడిటీ సమస్య ఉన్న వ్యక్తులు: మీకు అసిడిటీ సమస్య ఉంటే ఉసిరికాయను తినకూడదు. ఉసిరి జ్యూస్‌లాంటిది కూడా తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పుల్లని గుణాలు సమస్యను మరింత పెంచుతాయి. అలాగే, దంతక్షయం వంటి నోటి సమస్యలు ఉంటే ఉసిరి రసం తాగడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఉసిరి రసం తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.

శస్త్రచికిత్స: మీరు ఇటీవలే ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే లేదా శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే, ఆమ్లా జ్యూస్ తాగవద్దు. మీరు దానిని త్రాగితే, మీ రక్తస్రావం అనేక రెట్లు పెరుగుతుంది. ఉసిరికాయ రసం తీసుకోవడం వల్ల రక్తం పలచబడుతుంది. కాబట్టి, మీకు బీపీ సమస్య ఉంటే, మీరు ఈ జ్యూస్ తాగకుండా ఉండాలి.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు: గర్భిణీలు ఉసిరి రసం తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో దృఢత్వం, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. ఉసిరి రసానికి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే వారు ఊహించని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.