
మసాలా దినుసులు వంటలకు మంచి రుచిని అందించడమే కాకుండా, మన శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయి. వీటిల్లో మిరియాలు ముఖ్యమైనవి. అయితే వీటిలో వివిధ రకాలు ఉన్నాయి. నలుపు, తెలుపు మిరియాలు.. ఇలా రెండు రకాలుగా ఉంటాయి. అయితే వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు.

నల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావంతో రుచికి కారంగా ఉంటాయి. కానీ తెల్ల మిరియాలు నల్ల మిరియాలు కంటే తేలికపాటి, రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇందులో కారం అంతగా ఉండదు. అందుకే వీటిని క్రీములు, సూప్‌లు, వైట్ సాస్‌ల వంటి తేలికపాటి వంటకాలకు ఉపయోగిస్తారు.

నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నల్ల మిరియాలలోని పెపరిన్ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.

తెల్ల మిరియాలు పూర్తిగా పండిన ఎర్ర మిరియాలు. వీటిని నీటిలో నానబెట్టి వాటి బయటి తొక్కలను తొలగిస్తారు. తర్వాత మిగిలిన విత్తనాన్ని ఎండబెట్టాలి. ఇది మృదువైన ఆకృతిని, సున్నితమైన వాసనను ఇస్తుంది. నల్ల, తెల్ల మిరియాలు రెండింటినీ ఒకే చెట్టు నుంచి సేకరించినా ఈ విధమైన ప్రక్రియ వల్ల నల్లగా, తెల్లగా కనిపిస్తాయి. అలాగే రుచి కూడా భినంగా ఉంటుంది.

Black Pepper