
మీరూ జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం, జుట్టు చిట్లడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? నిజానికి శరీరంలో విటమిన్ లోపం ఏర్పడటం మూలంగా జుట్టు రాలుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్ లోపం వల్ల వెంట్రుకలు పల్చబడతాయి.

జుట్టు సంరక్షణకు విటమిన్ ఎ చాలా అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, పల్చబడడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు వస్తాయి.

జుట్టు పెరుగుదలకు, కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. అంతేకాకుండా ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, సన్నబడటం, చుండ్రుకు దారితీస్తుంది.

సూర్యుని హానికర కిరణాల నుంచి విటమిన్ ఇ రక్షిస్తుంది. విటమిన్ ఇ లోపం వల్ల జుట్టు రాలడం, పల్చబడడం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం వంటి సమస్యలు వస్తాయి.

కొబ్బరి నూనె జుట్టు పోషణకు ఉత్తమ ఎంపిక. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి. కొబ్బరి నూనెను వేడి చేసి జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. అలాగే ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు 30 నిమిషాలు అప్లై చేసి, గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బలంగా ఉంటుంది.