
ప్రపంచంలోని వివిధ దేశాల నోట్లపై ఆయా దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలు ముద్రించబడతాయి. అమెరికాలోని ప్రతి నోట్‌పై వేర్వేరు అధ్యక్షులు, ఇతర వ్యక్తుల చిత్రాలు ఉంటాయి. బ్రిటన్‌లో రాజు చిత్రం ఉంటుంది. అదే సమయంలో.. భారతదేశంలో ప్రతి కరెన్సీ నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశం కరెన్సీ నోట్ల పై ఎవరి చిత్రం ఉందో తెలుసా.

బ్రిటీష్ వారి నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత.. భారత ప్రభుత్వం 1949లో మొదటిసారిగా కొత్త డిజైన్‌తో ఒక రూపాయి నోటును ప్రవేశపెట్టింది. ఈ కరెన్సీ నోటుపై అశోక స్తంభం చిత్రాన్ని ముద్రించారు.

మహాత్మా గాంధీ చిత్రాన్ని మొదటిసారిగా కరెన్సీ నోట్‌పై ఎప్పుడు ముద్రించారంటే.. 1969లో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన నోటును విడుదల చేసింది. ఇందులో సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీజీ కూర్చొని ఉన్న ఫోటోని పొందుపరిచారు.

అయితే భారతదేశంలోని ప్రతి కరెన్సీ నోట్‌లో బాపు నవ్వుతున్న చిత్రం ఎప్పటి నుంచి ముద్రించడం మొదలు పెట్టారంటే.. భారతదేశపు కరెన్సీ నోటుపై 1987లో మొట్టమొదటిగా నవ్వుతున్న జాతిపిత చిత్రం ముద్రించబడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.500 నోటును ముద్రించారు. అందులో గాంధీ చిరునవ్వుతో కూడిన చిత్రం కనిపించింది. దీని తరువాత.. గాంధీజీ చిత్రాన్ని నిరంతరం ఉపయోగించడం ప్రారంభించారు

మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశం కరెన్సీ నోట్‌పై ఎవరి చిత్రం ముద్రించబడిందంటే.. గాంధీ కంటే ముందు, భారతదేశం కరెన్సీ నోట్‌పై బ్రిటన్ రాజు జార్జ్ VI చిత్రం ఉంది. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో గాంధీ బొమ్మని ముద్రించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ అది జరగడానికి చాలా సమయం పట్టింది. ఇంతలో.. బ్రిటిష్ రాజు చిత్రం స్థానంలో సారనాథ్ సింహ స్తంభాన్ని ఉపయోగించడం ప్రారంభించారు.