మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో అంతే సంగతులు..

Updated on: Jan 29, 2026 | 7:44 PM

చాలా మంది గోళ్లను కేవలం అందానికి, అలంకారానికి సంబంధించినవిగానే భావిస్తారు. నెయిల్ పాలిష్‌లు, రకరకాల డిజైన్లతో వాటిని ముస్తాబు చేస్తారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన గోళ్లు మన శరీరానికి ఒక హెల్త్ రిపోర్ట్ వంటివి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల తొలి లక్షణాలు మన గోళ్లలోనే కనిపిస్తాయి.

1 / 6
పసుపు రంగు గోళ్లు: గోళ్లు పసుపు రంగులోకి మారితే అది సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే.. థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యలు లేదా మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావచ్చు.

2 / 6
తెల్లటి మచ్చలు: గోళ్లపై వచ్చే తెల్లటి మచ్చలను ల్యూకోనిచియా అంటారు. ఇవి చిన్నపాటి గాయాల వల్ల లేదా అలర్జీల వల్ల రావచ్చు. కానీ, గోరు మొత్తం తెల్లగా మారడం ప్రారంభిస్తే అది శరీరంలో పోషకాల లోపాన్ని లేదా ఇతర ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది.

3 / 6
నీలిరంగు గోళ్లు: గోళ్లు నీలం లేదా ఊదా రంగులోకి మారుతున్నాయంటే.. శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేదని అర్థం. ఇది గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు సంకేతం. అలాగే విటమిన్ బి12 లోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం.

4 / 6
ముదురు ఎరుపు నెలవంకలు: గోళ్ల మొదట్లో ఉండే నెలవంక ఆకారం తెల్లగా కాకుండా ముదురు ఎరుపు రంగులో ఉంటే జాగ్రత్తపడాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. ఇది గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా లూపస్ వంటి వ్యాధులకు సంకేతం కావచ్చు.

5 / 6
గోళ్లపై నల్లటి గీతలు: ఎటువంటి దెబ్బ తగలకుండానే గోళ్ల కింద నల్లటి లేదా ముదురు రంగు గీతలు కనిపిస్తే అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు. దీనిని వెంటనే వైద్యులకు చూపించడం అత్యవసరం.

6 / 6
నెయిల్ క్లబ్బింగ్
గోళ్లు వెడల్పుగా మారి, గదలాగా ఉబ్బినట్లు కనిపిస్తే దానిని నెయిల్ క్లబ్బింగ్ అంటారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక గుండె సమస్యలను సూచిస్తుంది.

నెయిల్ క్లబ్బింగ్ గోళ్లు వెడల్పుగా మారి, గదలాగా ఉబ్బినట్లు కనిపిస్తే దానిని నెయిల్ క్లబ్బింగ్ అంటారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక గుండె సమస్యలను సూచిస్తుంది.