Motion of No Confidence: ‘మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..’ దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసారంటే..

|

Jul 27, 2023 | 10:47 AM

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉప నాయకుడు గౌరవ్‌ గగోరు బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా స్పీకర్‌ ఓం బిర్లా దానిని ఆమోదించారు. కాగా మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అసలింతకీ అవిశ్వాస తిర్మానం అంటే ఏమిటంటే..

1 / 5

2 / 5
అవిశ్వాస తీర్మానం అంటే.. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ ఆ అధికారాన్ని/పదవిని నిర్వర్తించటానికి అనర్హులని తాము భావిస్తున్నట్లు లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానం.

3 / 5
సాధారణంగా పార్లమెంటరీ దిగువ సభ (లోక్‌సభ)లో ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అర్హులు. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలో 198 అధికరణం దీని గురించి తెల్పుతుంది. దీని ప్రకారం లోక్‌సభ సమావేశ సమయంలో ఉదయం 10 గంటలలోపు సభా సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ప్రవేశపెట్టవచ్చు. అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. లేదంటే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు.

4 / 5
మెజార్టీ ఎంపీల విశ్వాసాన్ని కోల్పోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికైన సభకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అవిశ్వాస తీర్మానం అందిన పదిరోజుల్లోగా దానిని స్పీకర్‌ సభకు చదివి వినిపించి, దానిపై చర్చకు ఓ తేదీని స్పీకర్‌ నిర్ణయిస్తారు.

5 / 5
అవిశ్వాస తీర్మాణంలో ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది. స్వాతంత్య్రానంతర భారత దేశ పార్లమెంటు చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం.