Pista: రోజూ కాస్త పిస్తా పప్పు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

|

Jul 11, 2024 | 5:39 PM

ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ప్రూట్స్ లో పిస్తా కూడా ఒకటి. పిస్తా పప్పును రోజూ తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. పిస్తా తినడం వల్ల శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పొటాషియం, ఫాస్పరస్, విటమిన్-బి6, థయామిన్ కాపర్, విటమిన్ B6, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, కొవ్వులు, ప్రోటీన్ మొదలైనవన్నీ పిస్తా పప్పులో ఉంటాయి. రోజూ పిస్తాపప్పు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి పిల్లల మెదడుకు పదును పెడుతుంది.

1 / 5
పిస్తాలో అధిక మొత్తంలో ప్రొటీన్, ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఈ కారణంగా అతిగా తినకుండా చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.  పిస్తాపప్పులను తక్కువ పరిమాణంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు పిస్తా పప్పును తప్పనిసరిగా తినాలి.

2 / 5
డయాబెటిక్ పేషెంట్లు రోజూ కొన్ని పిస్తాపప్పులు తినడం వల్ల శరీరంలో గ్లైసెమిక్ స్థాయిలు తగ్గుతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. పిస్తా పప్పులో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్-బి6, థయామిన్ కాపర్, విటమిన్ B6, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, కొవ్వులు, ప్రోటీన్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి.

3 / 5
శరీరంలో ప్రొటీన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా పిస్తా పప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రోటీన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. పిస్తాపప్పు తినడం వల్ల ముఖంపై ముడతల ప్రభావం తగ్గుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

4 / 5
పిస్తాపప్పులు కంటి చూపును కూడా బలపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కంటి చూపు సమస్యలు ఉన్న వారు తప్పనిసరిగా పిస్తాను తమ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాన్సర్ కారక వైరస్‌లను నియంత్రించడంలో పిస్తాలో ఉండే పోషకాలు పనిచేస్తాయి. శరీరంలో విడుదలైన వ్యర్థాలను పిస్తా పప్పులు దూరం చేస్తాయి.

5 / 5
పిస్తాలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుతుంది. రోజూ కొన్ని పిస్తాపప్పులు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పిస్తాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది.