
శీతాకాలంలో చలి తీవ్రతకు చర్మం పొడి బారడం సహజం. అయితే ఈ విధంగా పొడి చర్మం సమస్య ఉన్న వారు ముఖానికి ముల్తానీ మిట్టిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ముల్తానీ మిట్టి చర్మం సహజ తేమను గ్రహిస్తుంది. ఇది పొడిబారడం, బిగుతుగా ఉండటం, పొరలుగా మారడం వంటి సమస్యలను మరింత పెంచుతుంది.

సున్నితమైన చర్మం స్వభావం ఉన్న అమ్మాయిలు కూడా ముల్తానీ మిట్టిని ముఖానికి పూయకూడదు. రోజ్ వాటర్ తేలికపాటిది అయినప్పటికీ ముల్తానీ మిట్టి చికాకు, దురదను కలిగిస్తుంది.

తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో ఇప్పటికే బాధపడేవారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు ముల్తానీ మిట్టి వాడితూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖంపై గాయాలు, కోతలు, ఇన్ఫెక్షన్లు ఉంటే ముల్తానీ మిట్టిని పూయకూడదు. మట్టిని పూయడం వల్ల గాయం నయం కావడానికి బదులుగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే మీ చెవి వెనుక లేదా మీ చేతికి అప్లై చేసుకోవాలి. ముల్తానీ మిట్టిని పెరుగు, తేనె లేదా పాలతో కలిపి వాడటం మంచిది.

ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేయవచ్చు. అది కూడా 10-12 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కుని.. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.