
అధిక రక్తపోటు, వాపు, నడుం నొప్పి వంటి వాటిని నియంత్రించడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది. దీన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు త్వరగా తగ్గించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకలిని తగ్గించే లక్షణాలు నల్ల జీలకర్రలో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, తృప్తి పెరుగుతుంది. నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతూ, మలబద్దకాన్ని నివారిస్తుంది. మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు, ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది. నిమ్మరసం,నల్ల జీలకర్ర నూనెను కలిపి రోజుకు రెండు సార్లు మొహానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.

నల్ల జీలకర్ర నూనె పంటికి సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది. వయసు పైబడిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్ర నూనెని నుదిటి పై మర్ధన చేసుకోవటం వల్ల తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

నల్ల జీలకర్ర నూనె, తేనె, గోరు వెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకుంటే ఆస్థమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్స్, ఫ్యాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరిగి బలంగా యారవుతుంది. అంతేకాదు.. తలలో చుండ్రును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తూ టైప్-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది. కంటి సమస్యలను నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్, లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి.