1 / 6
Rain Alert For AP: తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, నదుల్లో నీటి ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలు కాబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.