
వేసవిలో పుచ్చకాయలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. రుచితోపాటు వేసవి తాపాన్ని నివారించడంలో పుచ్చకాయలు ఉపయోగపడతాయి. అయితే పుచ్చ కాయ విత్తనాలు వృద్ధాగా పారేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. ఎందుకంటే పుచ్చకాయ మాదిరిగానే దాని గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

పుచ్చకాయ గింజలను బయటకు తీసి నీటితో బాగా శుభ్రం చేయాలి. తర్వాత వీటిని పొట్టు తీసి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఒలిచిన పుచ్చకాయ గింజలు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి.

జర్నల్ ఆఫ్ ఫార్మాకోగ్నోసి అండ్ ఫైటోకెమిస్ట్రీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. పుచ్చకాయ విత్తనాలను TB (క్షయవ్యాధి) చికిత్సలో ఉపయోగిస్తారు. ఊపిరితిత్తులలో బ్యాక్టీరియా చేరడం వల్ల దగ్గు సంభవిస్తుంది. మీకు కూడా దగ్గు ఉంటే ఈ గింజలు తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పుచ్చ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి.

పుచ్చకాయ గింజలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కిడ్నీలలో ఏర్పడే రాళ్లను నియంత్రిస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడిని నివారిస్తుంది.

పుచ్చకాయ గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నరాల, కండరాల సంకోచంలో సహాయపడుతుంది. ఈ పండు గింజలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.