ఇకపోతే, డయాబెటిక్ బాధితులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి. మధుమేహం ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి.