వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం..

Updated on: Mar 21, 2026 | 1:59 PM

Walking Vs Running: చాలామందికి వ్యాయామం అంటే పరుగెత్తడం అనే బలమైన నమ్మకం ఉంటుంది. కానీ అందరి శరీర తత్వం పరుగుకు సహకరించదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, అధిక బరువుతో ఇబ్బంది పడేవారు పరుగెత్తడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు కేవలం నడకతోనే ఆశించిన ఫలితాలు సాధించవచ్చా? అసలు మీ శరీరానికి ఏది బెస్ట్? అనేది తెలుసుకుందాం..

1 / 5
ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్న నేటి కాలంలో బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ ఎంచుకునే ప్రాథమిక మార్గాలు నడక లేదా పరుగు. అయితే వీటిలో ఏది వేగంగా ఫలితాన్ని ఇస్తుంది? కీళ్ల నొప్పులు ఉన్నవారు పరిగెత్తవచ్చా? తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ప్రముఖ వైద్య సంస్థల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

2 / 5
మీ లక్ష్యం తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను దహనం చేయడం అయితే పరుగు అత్యుత్తమ మార్గం. జర్నల్ ఆఫ్ ఒబేసిటీ అధ్యయనం ప్రకారం.. ఒకే దూరాన్ని నడిచే వారితో పోలిస్తే, పరుగెత్తే వారు వేగంగా శరీర కొవ్వును  కోల్పోతారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పరుగు ద్వారా సుమారు 300 కేలరీలను ఖర్చు చేయవచ్చు. అదే సమయంలో చురుకైన నడక ద్వారా కేవలం 140 నుండి 160 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి.

3 / 5
పరుగుతో పోలిస్తే నడకలో తక్కువ కేలరీలు ఖర్చవుతున్నాయని దీనిని తక్కువ అంచనా వేయలేం. అధిక బరువు ఉన్నవారికి, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి లేదా కొత్తగా వ్యాయామం ప్రారంభించే వారికి నడక అత్యంత సురక్షితమైనది. పరుగు వల్ల త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. కానీ నడకను ఎక్కువ సేపు సులభంగా చేయవచ్చు. మీరు ప్రతిరోజూ గంటసేపు చురుగ్గా నడిస్తే, పరుగు ద్వారా వచ్చే ఫలితాలనే సాధించవచ్చు.

4 / 5
మీరు దేనిని ఎంచుకోవాలనేది మీ శరీర తత్వం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. వేగంగా బరువు తగ్గడానికి మీకు ఓపిక, కీళ్ల సమస్యలు లేకపోతే పరుగు ఎంచుకోండి. మీకు కీళ్ల నొప్పులు ఉన్నా లేదా వ్యాయామం భారంగా అనిపించకూడదు అనుకున్నా వేగంగా నడవడం ఉత్తమం.

5 / 5
ఏ వ్యాయామమైనా నిలకడ అనేది ముఖ్యం. పరుగు అయినా, నడక అయినా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసినప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. మీ శరీర సామర్థ్యాన్ని బట్టి మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని ఆరోగ్యంగా మారండి.

Follow Us