Reverse Walking: ఎప్పుడూ ముందుకే కాదు.. రోజులో కాసేపు వెనకకు నడవండి.. మెదడుకు ఎంతో మంచిది!

Updated on: Jun 14, 2025 | 4:05 PM

ప్రస్తుతం ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇందుకోసం సరైన ఆహారం, వ్యాయామం అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొందరు ప్రతిరోజూ వాకింగ్ కూడా చేస్తుంటారు. అయితే, వాకింగ్, జాగింగ్ అనేది ఒకేలా చేస్తారు. అందరూ ముందుకే నడుస్తారు. కానీ, వాకింగ్‌ అంటే కేవలం ముందుకు నడవటం మాత్రమే కాదు..వెనక్కి కూడా నడవొచ్చు అంటున్నారు నిపుణులు. రోజులో ఐదు నిమిషాల పాటు వెనక్కి నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెనక్కి నడవడం వల్ల ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వెనక్కి నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో ఆనందం కూడా లభిస్తుంది. వెనక్కి నడవటం అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. నడవాలన్న కోరికను పెంచుతుంది. వెనక్కి నడవడం వల్ల స్ట్రెంత్‌ను పెంచుకోవచ్చు. అలాగే నెమ్మదిగా నడవటం వల్ల గాయపడే అవకాశం ఉండదు.

2 / 5
వెనక్కి నడవడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. వెనక్కి నడవడం వల్ల బాడీ బ్యాలెన్స్‌గా ఉంటుంది. పెద్ద వాళ్లు వెనక్కి నడవటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. వెనక్కి నడవడం వలన జీవక్రియలు కూడా మెరుగుపడతాయి.

3 / 5
వెనక్కి నడవడం వల్ల క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎక్కువ దూరం వాకింగ్ చేయకుండానే తక్కువ దూరంతోనే ఎక్కువ కేలరీలను కరిగించుకోవచ్చు. ఇది మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. వెనక్కి నడవడం వల్ల భంగిమ ఇంప్రూవ్ అవుతుంది. కండరాలు కూడా యాక్టివేట్ అవుతాయి.

4 / 5
వెనక్కి నడవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఫోకస్‌ ఇంప్రూవ్‌ అవుతుంది. మెదడు షార్ప్‌గా మారుతుంది. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి రివర్స్‌ వాకింగ్‌ హెల్ప్ చేస్తుంది. వెనక్కి నడవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రమం తప్పకుండా వెనుకకు నడవడం సాధన చేస్తే మీలో స్థిరత్వం, సమతుల్యత పెరుగుతాయి.

5 / 5
మీరు వెనుకకు నడిచినప్పుడు కండరాల పైనా, నాడీ మార్గాల పైనా దృష్టి పెడతారు. దీనివల్ల మెదడు సమన్వయ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. క్రమం తప్పకుండా వెనుకకు నడవడం సాధన చేస్తే మీలో స్థిరత్వం, సమతుల్యత పెరుగుతాయి.