విటమిన్ C లోపం ఉన్నప్పుడు, జుట్టు త్వరగా రాలటం, పొడిబారటం, పెలుసు అవడం, నిర్జీవంగా మారటం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. జుట్టు బలహీనమయ్యి ,రాలిపోతుంది. రెగ్యులర్‌గా జుట్టు పడుతున్నప్పుడు,విటమిన్ C లోపం ఉందని మీరు అనుమానించవచ్చు. చిగుళ్ల సమస్యలు, వాపులు, రక్తస్రావం వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి.
నిజానికి, విటమిన్లు చాలా ముఖ్యమైన పోషకాలు. వాటి లోపం వల్ల అనేక రకాల వ్యాధులు దాడి చేస్తాయి. అందులోనూ ఇతర విటమిన్లతో పోలిస్తే విటమిన్ బి12 అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? దీని నివారణకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్ బి12 పోషకాన్ని 'కోబాలమిన్' అని కూడా అంటారు. సాధారణంగా విటమిన్ బి12 లోపం శరీరంలో ఇతర విటమిన్లు, ఐరన్ లోపానికి దారి తీస్తాయి. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రక్తహీనత, నరాల సంబంధిత సమస్యలు, ఎముకలు, కండరాల బలహీనతకు కూడా కారణమవుతుంది. దీన్ని నివారించడానికి, శీతాకాలంలో లభించే కొన్ని ముఖ్య కూరగాయలను తీసుకోవడం అవసరం.
చలికాలంలో ఎక్కువగా దొరికే కూరగాయలలో పాలకూర ఒకటి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పైగా పాలకూర శరీరంలో విటమిన్ B-12 అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది.
గుమ్మడికాయలో కూడా విటమిన్ బి12, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి దీన్ని మీ రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. అలాగే దీనితో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. దీనితో పాటు పాలు, పెరుగు, జున్ను వంటి ఆహారాల్లో కూడా విటమిన్ B12 అధికంగా ఉంటుంది.