భారతదేశంలోని ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నగరాలు, గ్రామాలు, పర్వతాలు, గుహలలో ఎన్నో ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలోని అందమైన రాష్ట్రమైన కేరళలోని చిన్న నగరం మున్నార్‌లోని ప్రకృతి అందాల గురించి మీకు చెప్పబోతున్నాము.
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఒక పువ్వు ఉందని మీకు తెలుసా. అవును దాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అనేక ప్రాంతాల నుంచి ఇండియాకు వస్తారు.ఆ అందమైన పువ్వు పేరు 'నీల్కురింజి'.
నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. ఇది చాలా సంవత్సరాల తరువాత వికసిస్తుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా వికసించని ఒక జాతి పువ్వు.
కేరళ అటవీ తెగ ప్రజలు ఈ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారని ఒక పుస్తకంలో రాశారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం, మురుగ దేవుడు నీకురింజి పూల దండ ధరించి వల్లి అనే గిరిజన అమ్మాయిని వివాహం చేసుకున్నాడట.
కేరళలో వికసించే ఈ ప్రత్యేకమైన పువ్వులు కారణంగా పర్యాటక వ్యాపారం బాగా వృద్ధి చెందింది. నీలంకురింజి పువ్వు తేనెను కురింజితాన్ అంటారు. తేనెటీగలు ఈ పువ్వు రసాన్ని ఇష్టపడతాయి. స్థానిక గిరిజనులు మాత్రమే ఈ అరుదైన తేనెను తీసుకుంటూ ఉంటారు. మార్కెట్‌లో కూడా ఈ తేనె దొరకదు.