VIRAL PHOTOS : ఈ 5 పండ్లు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు..! ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

| Edited By: uppula Raju

Jul 12, 2021 | 10:21 AM

VIRAL PHOTOS : సాధారణంగా ఏవైనా పండ్లు కిలోకు 400, 500 ధర ఉంటే వామ్మో ఇంత ధర అని ఆశ్చర్యపోతారు. కానీ ప్రపంచంలో కొన్ని పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1 / 5
స్క్వేర్ పుచ్చకాయ: ప్రపంచంలో రౌండ్ మాత్రమే కాకుండా డబ్బాకారంగా ఉండే పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి సుమారు 2,26,837 కు అమ్ముడవుతాయి. దీని బరువు ఐదు కిలోలు.

2 / 5
తైయో నో టామాగో  : వీటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి అంటారు. జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో పండిస్తారు దేశవ్యాప్తంగా విక్రయిస్తారు. ఈ మామిడి కిలో ధర మూడు లక్షల రూపాయల కన్నా ఎక్కువ.

3 / 5
యుబారి పుచ్చకాయ: జపాన్‌కు చెందిన యుబారి పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు. ఈ ప్రత్యేక పండును జపాన్‌లో పండిస్తారు. వీటిని జపాన్‌లోని యుబారి ప్రాంతంలో పండిస్తారు. 2019 లో ఈ పుచ్చకాయల సరుకును రూ .33 లక్షలకు వేలం వేశారు.

4 / 5
రూబీ రోమన్ ద్రాక్ష: జపాన్‌లో ఈ ద్రాక్ష రకం ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. గత సంవత్సరం ఈ ద్రాక్షలో ఒక బంచ్ మాత్రమే రూ.7.50 లక్షలకు అమ్ముడైంది. ఖరీదైనది కనుక దీనిని 'ధనికుల ఫలం' అంటారు.

5 / 5
హెలిగాన్ పైనాపిల్: పసుపు రంగులో కనిపించే ఈ పైనాపిల్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. బ్రిటన్‌లోని లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ హెలిగాన్‌లో మాత్రమే పెరుగుతాయి. కేవలం ఒక పైనాపిల్ ధర లక్ష రూపాయలు.